ముస్లిం సోద‌రుల‌కు శుభాకాంక్ష‌లు

హైదరాబాద్ : వైయ‌స్సార్సీపీ ఆధ్వర్యంలో హైద‌రాబాద్ మోహదీపట్నంలో జరిగిన ఇఫ్తార్ విందుకు ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 
ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం తెలంగాణ వైయ‌స్సార్సీపీ మైనార్టీ విభాగం నాయ‌కులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దీనికి పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయ‌న తో పాటు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డి, అగ్ర నేత స‌జ్జ‌ల రామకృష్ణా రెడ్డి, న‌ల్లా సూర్య ప్ర‌కాశ్, ఇత‌ర మైనార్టీ సీనియ‌ర్ నేత‌లు హాజ‌రు అయ్యారు. వైయ‌స్ జ‌గ‌న్ ఇఫ్తార్ విందుకు హాజ‌రు అవుతున్నార‌ని తెలియటంతో పెద్ద ఎత్తున యువ‌త త‌ర‌లి వ‌చ్చారు. ఆయ‌న‌తో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ ప‌డ్డారు. 
Back to Top