వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అనంతపురం జిల్లాలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి బెంగుళూరుకు విమానంలో వచ్చిన వైయస్‌ జగన్‌ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం మీదుగా వైయస్‌ఆర్‌ జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా చిలమత్తూరు మండలంలోని కోడూరు తోపు వద్ద అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్‌ నారాయణ, పార్టీ నాయకులు, సింగిల్‌ విండో అధ్యక్షులు నరసింహారెడ్డి, మైనార్టీ సెల్‌ నాయకులు ఫరూక్, నరసారెడ్డి, శివారెడ్డి, సురేంద్రరెడ్డి, వాసు, సుధా, నంజిరెడ్డి, శంకర్‌రెడ్డి, జనార్దన్‌ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిపల్లి రైతుల సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

తాజా ఫోటోలు

Back to Top