ఘనంగా నూతన సంవత్సర వేడుకలు


హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వ‌హించారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరై కేక్‌లు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. దివంగత మహానేత డాక్ట‌ర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ మ‌హానేత  వైయస్‌ఆర్  ప్రజా పాల‌నను గుర్తు చేసుకున్నారు. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నీరుగార్చేప్ర‌త‌య్నం చేస్తున్నాయ‌ని, అలా చేస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని చెప్పారు. అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ పథకాలను అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. ప్రజావ్యతిరేక పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం చేసేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ప్ర‌తిపక్షంగా ప్రజల గొంతును వినిపిస్తూ వారికి అండగా ఉంటుందని ప్రభుత్వాలను హెచ్చరించారు. మహానేత పాలన మళ్లీ రావాలంటే అది ఒక్క వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. 2017 నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అన్నదాతలు పాడిపంటలతో సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు.


Back to Top