నేడు నెల్లూరుకు ఎంపీ మేకపాటి


 నెల్లూరు : ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేసి నెల్లూరు నగరానికి వస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి సోమవారం పార్టీ నాయకులు ఘనస్వాగతం పలకనున్నారు. విజయవాడ నుంచి సోమవారం ఉదయం పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు నగరానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఘనస్వాగతం పలకటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్లో స్వాగతం పలికి అక్కడి నుంచి భారీ ర్యాలీగా మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు.  

Back to Top