ఆత్మీయ స్వాగ‌తంచిత్తూరు:  ప్రజా సంకల్ప యాత్రలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది.  అడుగడుగునా హారతులిచ్చి, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.ఇవాళ ఉద‌యం కిలికిరి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్ర ప్రారంభమైంది. కొత్త‌ప‌ల్లి క్రాస్ మీదుగా యాత్ర సాగుతుండడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిమానులు చుట్టుముట్టడంతో పాదయాత్ర కాస్త ఆలస్యమైంది. ఎక్కడికక్కడ మహిళలు హారతులు పడుతూ, దిష్టి తీస్తూ ఆత్మీయ స్వాగతం పలికారు.  పీలేరు కో–ఆప్షన్‌ సభ్యుడు హాబీబ్‌బాషా, ఎంపీపీ హరిత ఆధ్వర్యంలో 500 మంది మహిళలు వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ చిహ్నాలు కలిగిన చీరలు ధరించి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. పాదయాత్రలో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Back to Top