జననేతకు జన నీరాజనం

  • తిమ్మంపల్లిలో వైయస్‌ జగన్‌కు బ్రహ్మరథం
  • అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు
  • అందరినీ ఆప్యాయంగా పలకరించిన జననేత
తాడిపత్రి : వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు నీరాజనం పలికారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లికి వచ్చారు.  తాడిపత్రి నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్దన్‌రెడ్డి, కోడలు సాయి అర్చితలను ఆశీర్వదించారు. అంతకు ముందు ఆయన వైయస్సార్‌ జిల్లా పులివెందుల నుంచి బయలుదేరి యల్లనూరు మండలం దంతలపల్లి, శింగవరం మీదుగా తిమ్మంపల్లికి చేరుకున్నారు. దంతలపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, జిల్లా యువజన విభాగం అ«ధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, జిల్లా, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 

అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని తిమ్మంపల్లికి చేరుకునేందుకు మూడు గంటలు పట్టింది. దారి పొడవునా వృద్ధులు, మహిళలు, యవకులు, విద్యార్థులు, రైతులు పెద్దసంఖ్యలో బారులుతీరి జననేతకు స్వాగతం పలికారు. వారికి జగన్‌ అభివాదం చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామమైన తిమ్మంపల్లిలో వీధులన్నీ జనంతో నిండిపోయాయి.  ప్రధాన రోడ్డుకు ఇరువైపులా, ఇళ్లపై నిలబడి జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఒకదశలో వారిని అదుపుచేయడం పోలీసులకు కష్టంగా మారింది. నూతన దంపతులు కేతిరెడ్డి హర్షవర్దన్‌రెడ్డి, సాయి అర్చితలను ఆశీర్వదించిన తర్వాత జగన్‌..   వారి కుంటుంబ సభ్యులతో  కలిసి భోజనం చేశారు. 

కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రాప్తాడు, కదిరి నియోజక వర్గ సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్‌ సిద్ధారెడ్డి, పార్టీ జిల్లా నేత ఎర్రిస్వామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం నాయకుడు గూడూరు సూర్యనారాయణరెడ్డి, యాడికి జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి పట్టణ,  రూరల్, పెద్దపప్పూరు, యాడికి పార్టీ కన్వీనర్‌లు రామ్మోహన్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రమేష్‌నాయుడు, నాయకులు ఆలూరు రామచంద్రారెడ్డి, రంగారెడ్డి, సుంకిరెడ్డి, వేంనాథ్‌రెడ్డి, మున్నా, శివారెడ్డి, రంగనాథ్‌రెడ్డి, కిషోర్, టీకే ఫయాజ్, మునాఫ్, ప్రదీప్, సంపత్, బాలరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

Back to Top