గన్నవరం ఎయిర్ పోర్ట్ లో వైయస్ జగన్ కు ఘనస్వాగతం

గన్నవరం :  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకున్నారు.  పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వైయ‌స్ జగన్ రోడ్డు మార్గం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా బయల్దేరారు. తణుకు సబ్ జైల్లో ఉన్నఆక్వా బాధితులను పరామర్శిస్తారు . అనంతరం జిల్లాలో  మెగా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, మత్య్సకారులకు సంఘీభావం తెలిపేందుకు భీమవరంలో పర్యటిస్తారు. అక్కడ బాధితులతో ముఖాముఖి నిర్వహించి బహిరంగసభలో ప్రసంగిస్తారు. 
Back to Top