జననేతకు ఘనస్వాగతం

కదిరి:

 అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.  ఉదయం బెంగళూరు నుంచి పులివెందులకు వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరారు.  కదిరి పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్‌లో ఆయన కాన్వాయ్‌ను చూసిన అభిమానులు అభివాదాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. వాహనం దిగి వచ్చి  వైఎస్ జగన్ వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. దీంతో, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కదిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా టీడీపీలో చేరడం వల్ల పార్టీకి స్థానికంగా వచ్చిన నష్టం ఏమీ లేదంటూ వారు ఈ సందర్భంగా నినాదాలు చేశారు.


To read this article in English: http://bit.ly/1VQ4sjC

Back to Top