రాజన్న బిడ్డకు అడుగడుగునా జననీరాజనం

 నాగార్జున సాగర్ నుంచి  త్రిపురారం వరకు షర్మిల పరామర్శయాత్ర 
నియోజకవర్గంలో మూడు కుటుంబాలను పరామర్శించిన షర్మిలమ్మ 
 ఆప్యాయంగా పలకరించిన షర్మిల ....పరవశించిపోయిన ప్రజలు 

హాలియా (నల్లగొండ జిల్లా): రాజన్నబిడ్డ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు షర్మిల పరామర్శయాత్ర గురువారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కొనసాగింది. తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాలమరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను  ఆమె పరామర్శించారు. బుదవారం రాత్రే నాగార్జున సాగర్ చేరుకున్న షర్మిల ఉదయం 9.45 నిమిషాలకు యాత్రను  ప్రారంభించారు. మొదటగా నాగార్జున సాగర్ హిల్‌కాలనీలలోని నివాసం ఉంటున్న  కామిశెట్టి వెంకటనర్సయ్య నివాసానికి ఉదయం 10 గంటలకు  వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 40 నిమిషాల పాటు అక్కడే ఉండి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  మీకు మేమున్నాం అంటూ మనోదైర్యం కల్పించారు. అక్కడ నుంచి హాలియా మండలం గరికేనాటితండాలో మృతి చెందిన బాణావత్ బోడియా నాయక్‌కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు.  గరికేనాటితండా  ప్రజలు షర్మిలమ్మకు ఎదురేగి స్వాగతం పలికారు.  షర్మిల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. 12.20 నిమిషాలకు గరికేనాటితండాలో బోడియా నాయక్ ఇంటికి షర్మిల వెళ్లారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, బోడియా నాయక్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. అనంతరం షర్మిల బోడియా నాయక్ సతీమణీ గోగిలితో పాటు వారి కుటుంబ సభ్యులను  అమ్మా బాగున్నారా  అంటూ ఆప్యాయంగా  పలుకరించారు. కుటుంబ సభ్యులను పేరుపేరున పరిచయం చేసుకున్నారు. ఆమె  ఏం చేస్తున్నారు. ఎలా జీవిస్తున్నారు. వ్యవసాయం ఎలా ఉంది. ఏడాది పంటలు బాగా పండినాయా  అంటూ బోడియా నాయక్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.  మా నాన్నకు మీనాన్నంటే ఇష్టం. మా నాన్న చనిపోయి  ఐదున్నర సంవత్సరాలైన తరువాత కూడ మీరు  మమ్ముల్ని గుర్తుంచుకొని మా ఇంటికి వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉందంటూ తమ క ష్టసుఖాలను షర్మిలమ్మతో పంచుకున్నారు. అనంతరం షర్మిల గరికేనాటితండ నుంచి త్రిపురారం బయల్ధేరారు. త్రిపురారం  మండల కేంద్రంలో రాజన్న మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన మైల రాములు కుటుంబ సభ్యులను పరమార్శించారు.  మద్యాహ్నానం 3.30 నిమిషాలకు మైల రాములు కుటుంబానికి వెళ్లిన ఆమె 4.15 వరకు  అక్కడే ఉన్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మీరు దైర్యంగా ఉండండి. పిల్లల్ని బాగా చదివించండి, అన్ని రకాలుగా సహకరిస్తాం  ఏకష్టం వచ్చిన మేమున్నాం అంటూ షర్మిల  భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పరామర్శ యాత్ర  మిర్యాలగూడెం నియోజకవర్గానికి సాగిపోయింది. షర్మిల వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగా రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గట్టు శ్రీకాంత్‌రెడ్డి,  గున్నం నాగిరెడ్డి, కొండ రాఘవరెడ్డి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సిద్థార్థరెడ్డి, నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మల్లు రవీందర్‌రెడ్డి,  స్టేట్ యూత్ ప్రెసిడెంట్ బిష్య రవీందర్, రాష్ట్ర కార్యదర్శి ఇరుగు సునిల్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి, నాగార్జున సారగ్ నియోజకవర్గ నాయకులు జాషువా, బురాన్, సైదాచారి, రవి, నహింపాసా, జానీ, పెద్దులు, జాన్‌రాజ్, రాంరెడ్డి, కృష్ణారెడ్డి గంగాధర్, ఉపేందర్, గడ్డం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 

 
 అడుగడుగున జననీరాజనం.... 
 తన మంత్రి మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వచ్చిన షర్మిలకు నియోజకవర్గ ప్రజలు  ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా ప్రజలను  షర్మిలమ్మ  అమ్మా బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించడంతో పాటు  కరచాలనం చేశారు. షర్మిలమ్మతో కరచాలనం చేసేందుకు, రాజన్న బిడ్డ చేయిని  తాకేందుకు ప్రజలు పోటీపడ్డారు. షర్మిలమ్మ సైతం విద్యార్థులు, యువతీ యువకులు, రైతులు, రైతుకూలీలను ఆప్యాయంగా పలకరించడంతో పాటు వారితో  కరచాలనం చేసి సంతోషపరిచారు. అమ్మా మీ నాన్న ఉన్నప్పుడే పరిపాలన భాగుందని, మీ కుటుంబం  చ ల్లగుండాలని ప్రజలు దీవెనలిచ్చారు.  

తాజా ఫోటోలు

Back to Top