ఎమ్మెల్యే పిఆర్కేకు ఘన స్వాగతం

మాచర్ల : వైయస్సార్‌ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌ పొంది శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయానికి చేరుకోగా నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి మాచర్లకు చేరుకున్న ఆయన బెయిల్‌ పొంది పార్టీ కార్యాలయానికి చేరుకోగా వైయస్సార్‌సీపీ మాచర్ల జెడ్పీటీసీ సభ్యులు శౌరెడ్డి గోపిరెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ యరబోతుల శ్రీనివాసరావు, తాడి వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు బత్తుల ఏడుకొండలు, కామనబోయిన కోటయ్య, పురపాలక సంఘ ఫ్లోర్‌ లీడర్‌ బోయ రఘురామిరెడ్డి, డిప్యూటీ లీడర్‌ షేక్‌ కరిముల్లా, మండల ప్రత్యేక ఆహ్వానితుడు కుర్రి సాయి మార్కొండారెడ్డి, ఓరుగంటి జయపాల్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు చుండూరు రోశయ్య, షేక్‌ కరిముల్లా, కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వర్లు, యూత్‌ అధ్యక్షుడు తురకా కిశోర్, జిల్లా పార్టీ కార్యదర్శి నల్ల వెంకటరెడ్డి, మారం వాసు, శ్రీనివాసశర్మ, బండారు పరమేశ్వరరావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు గాదె శ్రీనివాసరెడ్డి, మంచికల్లు సీతారెడ్డి, కాశిరెడ్డి, వెల్దుర్తి మండల మాజీ అధ్యక్షుడు పల్లపాటి గురుబ్రహ్మం, బాలబ్రదయ్య, పార్లపల్లి పెదగాలయ్య, కండ్లకుంటకు చెందిన ఈడెబోయిన వెంకయ్య, పురపాలక సంఘం వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు అన్నెం అనంతరావమ్మ, నాయకులు స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండల పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వందల సంఖ్యలో ఆయనను కలుసుకొని న్యాయం మన వైపై ఉంటుందన్నారు.

తాజా వీడియోలు

Back to Top