అమరావతిలో అపూర్వ స్వాగతం

  • రాజధానిలో వైయస్ జగన్ కు ఘనస్వాగతం
  • పూలతో వెల్ కమ్ చెప్పిన ప్రజలు, పార్టీశ్రేణులు
  • ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యేలతో కలిసి వెలగపూడికి వైయస్ జగన్
  • వేదమంత్రాల మధ్య వైయస్ఆర్సీఎల్పీ ఛాంబర్ లోకి ప్రవేశం
అమ‌రావ‌తి:  న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో వైయ‌స్అర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వెలగపూడికి వచ్చిన వైయస్ జగన్ కు స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న  వైయస్ జగన్ కు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గన్నవరం మండలం కేసరపల్లిలో వైయస్‌ఆర్‌సీసీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. 

రాజధాని ప్రాంతం పెనుమాకలో గ్రామస్తులు వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికారు. రోడ్డుపై పూలు చలి అపూర్వస్వాగతం పలికారు. స్థానికంగా ఏర్పాటు చేసిన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి వైయస్ జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళలు జ‌న‌నేత‌కు హారతి ఇచ్చారు. అక్క‌డి నుంచి విజ‌య‌వాడ‌లోని ఆర్ అండ్ బీ అతిథి గృహం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌తో  సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 46 ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. 

అనంత‌రం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో క‌లిసి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక బ‌స్సులో వెల‌గ‌పూడిలోని తాత్కాలిక అసెంబ్లీ భ‌వ‌నానికి చేరుకున్నారు. అక్క‌డ కూడా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అనంత‌రం నూత‌నంగా నిర్మించిన వైయ‌స్ఆర్సీఎల్పీ కార్యాల‌యాన్ని వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించి త‌న ఛాంబ‌ర్‌లోకి ప్ర‌వేశం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వైయస్ జగన్ ను ఆశీర్వదించారు. ఛాంబ‌ర్‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ను కూర్చొబెట్టి పార్టీ నేత‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో క‌లిసి వైయస్ జగన్ సభా ప్రాంతానికి చేరుకొని ఆశీనులయ్యారు. ఏడాది  తర్వాత ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి హాజరయ్యారు. 
Back to Top