జ‌న‌మే జ‌నం



- రైతులు, మహిళల నుంచి అనూహ్య స్పందన
- జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ గ్రామాన ఘ‌న స్వాగ‌తం
చిత్తూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. చిత్తూరు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర కొనసాగుతోంది. ఒకవైపు పండుగ ఉన్నా జనంతో దారులన్నీ కిటకిటలాడుతున్నాయి.  
 రాజ‌న్న బిడ్డ‌కు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజా సంకల్పయాత్రలో జననేత ఇస్తున్న హామీలు కొండంత భరోసానిస్తున్నాయని జనం విశ్వసిస్తున్నారు. రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యమని పిడికిలి బిగిస్తున్నారు. అభిమాన నేత వెంట అడుగులో అడుగేస్తూ అండగా నిలుస్తున్నారు.  అభిమాన నేతను చూసేందుకు జనం బారులు తీరుతున్నారు. వినూత్నంగా స్వాగతం పలికేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. బుధ‌వారం న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని పాదిరేడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్రను ప్రారంభించారు. ప్ర‌తి ఒక్క‌రిని ఆయ‌న‌ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.  ల‌క్ష్మ‌మ్మ కండ్రిగ గ్రామ ముఖద్వారం వద్ద వైయ‌స్ జగన్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. యాత్ర పొడవునా ప్రజలు మేళతాళాలు, డప్పులు, బాణసంచా పేలుళ్లతో ఎదురేగి స్వాగతం పలికి మంగళహారతులు పట్టారు. వైయ‌స్ జగన్‌తో సెల్ఫీల కోసం పోటీపడ్డారు. ‘మా పెద్ద కొడుకు మా ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది’అని ముచ్చటపడ్డారు. రైతులు, మ‌హిళ‌ల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. గ్రామ గ్రామాన ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతూ త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు.

తాజా వీడియోలు

Back to Top