రాజోలి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌న్న బిడ్డ‌

- వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న‌
- బాధ‌లు చెప్పుకుంటున్న కోన‌సీమ‌వాసులు
తూర్పుగోదావరి:  చంద్ర‌బాబు పాల‌న‌లో మోస‌పోయిన ప్ర‌తి ఒక్క‌రికి ధైర్యం చెప్పేందుకు పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కోన‌సీమ‌లో అపూర్వ స్వాగ‌తం ల‌భిస్తోంది. గోదావరి డెల్టా కాలువలు, కొబ్బరిచెట్లు, అరటి తోటల మధ్య కోనసీమలో ప్రజాసంకల్ప యాత్ర ఆహ్లాదంగా సాగుతోంది. వైయ‌స్ జ‌గ‌న్‌ చేస్తున్న పాదయాత్ర 194వ రోజు  బుధవారం ఉదయం నాగుల్లంక శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చాకలిపాలెం, తాటిపాక మఠం మీదుగా పొదలాడ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర  తిరిగి మధ్యాహ్నం 2.45కు ప్రారంభమౌతుంది. అనంతరం పాదయాత్ర రాజోలు వరకు కొనసాగుతుంది. రాజోలులో జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి  ప్రసంగిస్తారు. 

జ‌న‌నేత‌కు బ్ర‌హ్మ‌ర‌థం
వైయ‌స్ జ‌గ‌న్‌కు కోన‌సీమ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇవాళ పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర రాజోలి నియోజ‌క‌వ‌ర్గంలోని అడుగుపెట్టింది. రాజ‌న్న బిడ్డ‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఎదురెళ్లి హార‌తి ప‌ట్టి ఆహ్వానించారు. గ్రామాల్లోని రోడ్లపై పూలు చల్లి తమ అభిమాన నేతను వాటిపై నడిపించారు. ప్రతి గ్రామంలో అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, పిల్లలను వైయ‌స్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. అక్కచెల్లెమ్మలకు స్వయంగా సెల్ఫీలు తీసి ఇచ్చారు. యువత తమకు కూడా సెల్ఫీలు కావాలని పట్టుబట్టడంతో పలుచోట్ల వారితో సెల్ఫీలు దిగారు. వైయ‌స్‌ జగన్‌ను చూసేందుకు, ఆయన స్పర్శ కోసం యువత ఉవ్విళ్లూరింది. వైయ‌స్ జ‌గ‌న్ అనే నినాదాలతో పాదయాత్ర పొడవునా హోరెత్తించింది. దారి పొడ‌వునా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ..వారికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. సాయంత్రం రాజోలి ప‌ట్ట‌ణానికి వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తుండ‌టంతో ప‌ట్ట‌ణంలోని ప్ర‌ధాన కూడలి పార్టీ జెండాల‌తో రెప‌రెప‌లాడుతోంది. వేలాదిగా జ‌నం త‌ర‌లివ‌స్తున్నారు. 
Back to Top