నాయ‌కుడొచ్చాడు..




ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రకు విశేష స్పంద‌న‌
దారిపొడ‌వునా జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు బాధ‌లు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు
పొటెత్తుతున్న పాద‌యాత్ర దారులు
నేనున్నానంటూ భ‌రోసా కల్పిస్తున్న రాజ‌న్న బిడ్డ‌
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా:  నాలుగేళ్లుగా ప‌డుతున్న క‌ష్టాల‌ను చెప్పుకునేందుకు నాయ‌కుడొచ్చాడ‌ని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిర్వీరామంగా కొన‌సాగుతోంది. జనం కోసం మొదలైన జైత్రయాత్ర.. సంకల్పం శ్వాసగా సాగిపోతోంది.  శనివారం ఉదయం వైయ‌స్‌ జగన్‌ నల్లజెర్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రకాసరావు పాలెం చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి వైయ‌స్‌ఆర్‌ హార్టికల్చర్‌ యునివర్సిటీ, తెలికిచర్ల క్రాస్‌ నుంచి వెంకటరామన్న గూడెం చేరుకుంటారు.  దారిపొడవునా ప్రజలు రాజన్న బిడ్డకు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా భరోసానిస్తూ జననేత అడుగులు ముందుకు వేస్తున్నారు. 


మండుటెండలోనూ జగనన్న వెంట..
దారిపొడవునా ప్రజలు అభిమాన నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు.  జననేతను కలిసి తమ కష్టసుఖాలను పంచుకున్నారు. అధికార పార్టీ బెదిరింపులను లెక్కచేయకుండా మండుటెండలోనూ జగనన్న వెంట నడుస్తున్నారు.  మా ఆశవు నీవే.. శ్వాసవు నీవే అంటూ నినదిస్తున్నారు.   గ్రామాలకు గ్రామాలే వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రకు కదిలివస్తుంటే.. టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. ప్రజలను నయానో..భయానో పాదయాత్రకు వెళ్లకుండా నిలువరించేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. తమ కంచుకోటలకు  బీటలు పడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.  జిల్లాలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ అభిమాన నేతను చూసేందుకు, కలిసి కష్టాలు చెప్పుకునేందుకు పోటీపడుతున్నారు. దీంతో పాదయాత్ర జన జాతరలా సాగుతోంది.  రాజ‌న్న బిడ్డ‌కు అడుగడుగునా హారతులు పడుతున్నారు. గుమ్మడికాయలతో దిష్టితీస్తున్నారు. యువత, విద్యార్థులు జననేతతో కరచాలనం, సెల్ఫీ కోసం ఉవ్విళ్లూరుతున్నారు.    


Back to Top