అన్న వస్తేనే ఆనందం

పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
వైయస్‌ జగన్‌కు అడుగడుగునా.. ప్రజాదరణ
వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన వందలాది మంది అగ్నికుల క్షత్రియులు
తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లా జిల్లాకు జనం తాకిడి విపరీతంగా పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలంతా అక్కున చేర్చుకుంటున్నారు. ‘అన్న వస్తేనే అనందం’ అంటూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. 193వ రోజు ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌ను కలిసి వారి సమస్యలను వెల్లడించారు. డొక్క సీతమ్మ అక్విడెక్ట్‌ వద్ద జననేతను మహిళలు కలిశారు. వారి సమస్యలను చెప్పుకున్నారు. డ్వాక్రా సంఘాల రుణాలు మాపీ కాలేదని, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 
వందలాది మంది చేరిక...
జొన్నలంక చేరుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వందలాది మంది అగ్నికుల క్షత్రియులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపర్చి ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటూనే మన రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో పార్టీలో చేరామన్నారు. 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకునేందుకు అందరూ కృషి చేయాలన్నారు. 
అన్నే మా పాపకు పేరుపెట్టాలి...
తమ పాపకు నామకరణం చేయాలని దంపతులిద్దరూ జొన్నలంక వద్ద వైయస్‌ జగన్‌ను కలిశారు. వారి కోరిక మేరకు వైయస్‌ జగన్‌ చిన్నారికి రాజశేఖర్‌ అని నామకరణం చేశారు. తమ బిడ్డకు జగన్‌ అన్నే పేరు పెట్టాలని మూడు నెలలుగా ఎదురు చూస్తున్నామని, అన్న వస్తున్నాడని తెలిసి జొన్నలంకకు వచ్చి తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరామన్నారు. 
Back to Top