జననేత వెంట ఎగసిపడుతున్న జనకెరటం

101వ నియోజకవర్గం పిఠాపురంలోకి అడుగుపెట్టిన వైయస్‌ జగన్‌
ఘనస్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు
సాయంత్రం ఉప్పాడలో వైయస్‌ఆర్‌ సీపీ భారీ బహిరంగ సభ
తూర్పుగోదావరి: ప్రజా సంకల్పయాత్రకు జన కెరటం ఎగసిపడుతోంది. రాష్ట్రానికి సేవచేయాలని తపిస్తున్న రాజన్న బిడ్డకు ఘనస్వాగతం పలికేందుకు పిఠాపురం ఎదురుచూస్తొంది. పాదయాత్రగా తమ పట్టణానికి వస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు పిఠాపురం వాసులు భారీ ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర సాగే దారంతా వైయస్‌ జగన్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లతో కళకళలాడుతోంది. జననేతకు మర్చిపోలేని స్వాగతం పలుకుతామని నియోజకవర్గ వాసులు అంటున్నారు. చంద్రబాబు చేతిలో మోసపోయిన ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు.. వారిని ఆదుకొని అక్కున చేర్చుకునేందుకు నవంబర్‌ 6వ తేదీన వైయస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు. వైయస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర 225వ రోజుకు చేరుకుంది. అలుపెరగని బాటసారిగా జననేత 101వ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. విరవ నుంచి పిఠాపురంలోకి పాదయాత్ర ప్రవేశించింది. ఈ మేరకు ప్రజలంతా సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో భారీ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నాయకులు పూర్తి చేశారు. 

పురుహితిక దేవి పుట్టిన పిఠాపురంలోకి అడుగుపెడుతున్న వైయస్‌ జగన్‌కు అమ్మ ఆశీస్సులు ఉంటాయని, రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని పాదయాత్రకు తరలివచ్చిన ప్రజలు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్నారు. దక్షిగా కాశీగా పేరొందిన పిఠాపురంలోకి జననేత అడుగుపెట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన వస్తుంది. ప్రజలంతా వైయస్‌ జగన్‌ను కలిసేందుకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక నాయకుడికి ఇంతటి ప్రజాదరణ ఎప్పుడూ చూడలేదని, ప్రజలకు ఇచ్చిన  హామీల్లో ఒక్కటి కూడా తూచా తప్పకుండా వైయస్‌ జగన్‌ నెరవేరుస్తాడని నమ్మకం ఉందని వైయస్‌ఆర్‌ సీపీ నేత కొప్పుల మోహనరావు అన్నారు. 
 
Back to Top