సాంప్రదాయ రీతిలో వైయస్‌ జగన్‌కు అపూర్వ స్వాగతం


– కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోకి వైయస్‌ జగన్‌ పాదయాత్ర

తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఊరూరా అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఒక్కో చోట ఒక్కో రకంగా అభిమానులు జననేతకు స్వాగతం పలుకుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం వైయస్‌ జగన్‌ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ భారీ జెండాతో అభిమానులు వైయస్‌ జగన్‌ పాదయాత్రలో పాల్గొన్నారు. తెలుగు దనం ఉట్టిపడేలా అభిమానులు తెల్ల చొక్కా, తెల్ల పంచె, పార్టీ కండువాలు ధరించి ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. వాడవాడల జగన్‌ నినాదం మారుమోగుతోంది. తమ కోసం వస్తున్న వైయస్‌ జగన్‌ను అశేషంగా ప్రజలు ఆదరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గం అత్యంత అధిక మెజారిటీతో గెలుస్తుందని చెప్పారు. ఇదే ఊపు రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పేర్కొంటున్నారు.  వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
Back to Top