నిడదవోలులో జననేతకు ఘన స్వాగతం


పశ్చిమగోదావరి: అడుగడుగునా కష్టాలు, కన్నీళ్లు. ఆదుకునే వారి కోసం ఎదురుచూపులు. ఇచ్చిన హామీలను గాలికొదిలిన ప్రభుత్వంపై ఆగ్రహ జ్వలాలు. ప్రతి ఒక్కరి నోట ఆవేదన ప్రవాహం. జననేత వైయస్‌ జగన్‌ ఆగమనంతో జనంలో వెల్లువిరిసిన ఆనందం. తమ బాధలు తీర్చేవాడు వచ్చాడని, భవిష్యత్తుపై బంగారు ఆశలు. జనంతో మమేకవుతూ..వారి కష్టాలు తెలుసుకుంటున్నారు. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం తణుకు నుంచి నిడదవోలు నియోజకవర్గంలోకి వైయస్‌ జగన్‌ పాదయాత్ర అడుగుపెట్టింది. ఈ సందర్భంగా స్థానికులు వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. వర్షం కురుస్తున్నా వైయస్‌ జగన్‌ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఆయన వెంట వేలాది మంది అడుగులో అడుగులు వేస్తున్నారు. దారి పొడవునా సమస్యలు చెప్పుకుంటున్నారు.
 
Back to Top