అక్క‌చెల్లెమ్మ‌ల ఆత్మీయ స్వాగ‌తం


 

పశ్చిమగోదావరి : ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆడ‌ప‌డుచులు అడుగ‌డుగునా ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఎదురెళ్లి హార‌తులు ఇస్తున్నారు. నుదుట‌న తిల‌కం దిద్ది ఆప్యాయత‌లు పంచుతున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా తణుకు నియోజకవర్గంలో అడుగిడిన వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి అయితంపూడిలో పెద్దిరెడ్డిపాలెం, కంతేరు, గోటేరు, ఇరగవరం గ్రామాల మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రంగు చీరలను కట్టుకుని స్వాగతం చెప్పారు. జగనన్న సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు. ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో డ్వాక్రా మహిళలతో నడుస్తున్న ఐకేపీ  ధాన్యం కొనుగోలు కేంద్రంలో మూడేళ్లుగా అవకతవకలు జరుగుతున్నాయి. డ్వాక్రాకు చెందిన సీవో వచ్చి మా గ్రామంలోని 40 గ్రూపులకు చెందిన 350 మంది మహిళల ఆధార్, రేషన్‌ కార్డు జిరాక్సులు, రెండు ఫొటోలు తీసుకునివెళ్లార‌ని మ‌హిళ‌లు పేర్కొన్నారు. మా ప్రమేయం లేకుండా బ్యాంకులో అకౌంట్‌లు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేసినట్టు చూపించి సుమారు రూ.38 లక్షలు దోచుకున్నారంటూ అంటూ గోగులగుంట పాదయాత్ర వద్ద కత్తవపాడుకు చెందిన మహిళలు ఆధారాలతో సహా వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

 

Back to Top