అమ్మ ఒడి..థ్యాంక్స్ అంకుల్‌

నెల్లూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలలో చిన్నారుల చ‌దువుల నిమిత్తం ప్ర‌వేశ‌పెట్టిన‌ అమ్మ ఒడి ప‌థ‌కం పేదల జీవితాలకు ఎంతో భరోసా ఇస్తుంది.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమ్మ ఒడి ప‌థ‌కం కింద చిన్నారుల‌ను బ‌డికి పంపించినందుకు త‌ల్లిఖాతాలో ప్ర‌తి ఏడాది రూ.15 వేలు జ‌మా చేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షాతిరేకాలు వెల్లువెత్తున్నాయి. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లెలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను చిన్నారులు క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. థ్యాంక్స్ అంకుల్ అంటూ ప్లేకార్డులు ప‌ట్టుకొని జ‌న‌నేత‌కు స్వాగ‌తం ప‌లికారు.  పేదల కుటుంబాల్లో ఆనందం నింపేందుకు వారి పిల్లల చదువులకు ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 15 వేల వరకూ నేరుగా తల్లుల చేతికే అందించేందుకు అమ్మ డి పేరుతో ఈ ప‌థ‌కంను  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి  వచ్చిన వెంటనే అమలు చేస్తుంది.  గ్రామాల్లో ఈ ప‌థ‌కానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ ప‌థ‌కాన్ని వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేస్తారని విశ్వ‌సిస్తున్నారు.  
Back to Top