వైయస్‌ జగన్‌కు పూలబాటనెల్లూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి గ్రామ గ్రామాన ఘన స్వాగతం లభిస్తోంది. 74వ రోజు పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌కు స్థానికులు పూలబాట వేశారు. వందలాది మంది స్కూల్‌ పిల్లలు రోడ్డుపైకి వచ్చిన వైయస్‌ జగన్‌కు సంఘీభావం తెలిపారు. వెల్‌కం టూ జగనన్న అంటూ నినదించారు. గ్రామస్తులు పనులు మానుకొని జననేత కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ వైయస్‌ జగన్‌ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని పూర్తి చేసుకోనుంది. ఈ మేరకు వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద ప్రత్యేక స్థూపం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాక్‌విత్‌ జగనన్న కార్యక్రమం పేరుతో సంఘీభావ యాత్రలు చేపడుతున్నారు.  

తాజా ఫోటోలు

Back to Top