వైయస్‌ జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం



– బండకిందపల్లి వద్ద పండుగ వాతావరణం
చిత్తూరు:  ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. అడుగడుగునా వైయస్‌ జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. దారిపొడువునా ప్రజలు తమ బాధలు వైయస్‌ జగన్‌కు చెప్పుకుంటున్నారు. 57వ రోజు ప్రజా సంకల్ప యాత్ర పూతలపట్టు నియోజకవర్గంలోని బత్తలవారిపల్లె నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి మిట్టపాల్యం, వెంకటాపురం మీదుగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని బండకిందపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, పార్టీ సీనియర్‌ నేతల ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌కు వేద పండితులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజన్న బిడ్డ రాకతో బండకిందపల్లె వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం వైయస్‌ జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలు వైయస్‌ జగన్‌కు వివరించారు. చ క్కెర ఫ్యాక్టరీ తెరిపించి ఆదుకోవాలని రైతులు విన్నవించారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
 
Back to Top