హారతితో ఆహ్వానం పలికిన రోజా


చిత్తూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. బుధ‌వారం జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా హార‌తి ఇచ్చి ఆహ్వానం ప‌లికారు. అనంత‌రం నుదుట బొట్టు పెట్టి మురిసిపోయారు. అధికార పక్ష అన్యాయాలను ప్రజలకు వివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా  భరోసా ఇస్తున్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగాల‌ని రోజా ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..చంద్ర‌బాబు త‌న సొంత జిల్లాకు ఎలాంటి మేలు చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ప‌దే ప‌దే చంద్ర‌బాబు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. ప్ర‌జ‌లంతా వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు రోజా పేర్కొన్నారు. 
నేటి యాత్ర జమ్మిలవారిపల్లి శివారు నుంచి ప్రారంభమై చింతపర్తి, పాతకోటపల్లి, బీదవారిపల్లి, గండబోయనపల్లి, డెకలకొండ మీదుగా కలికిర వరకు కొనసాగుతుంది. 
Back to Top