మేకపాటికి ఘన స్వాగతం


నెల్లూరు: ప్రత్యేక హోదా కోసం ఈ నెల 6వ తేదీ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ తరువాత ఢిల్లీలో ఆమరణనిరాహార దీక్ష చేసిన వైయస్‌ఆర్‌సీపీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డికి నెల్లూరు జిల్లాలో ఘన స్వాగతం లభించింది.  రాజీనామా అనంతరం మొట్ట మొదటి సారిగా జిల్లాకు రావడంతో కావలిలో మేకపాటికి అపూర్వ స్వాగతం పలికారు. పార్టీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్, పార్టీ శ్రేణులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
 
Back to Top