వైయస్‌ జగన్‌కు ఘనంగా వీడ్కోలు

వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే ఉద్యోగాలు
తూర్పు గోదావరి జిల్లా కోటనందురుకు చెందిన విద్యార్థినులు వైయస్‌ జగన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని విద్యార్థినులు పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలన మేడిపండు చందంగా ఉందని వారు ఎద్దేవా చేశారు. వైయస్‌ జగన్‌ రెండు నెలల పాటు మా జిల్లాలో పాదయాత్ర చేయడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థినులు పేర్కొన్నారు. ఈ రోజుతో జగనన్న మా జిల్లా వవదిలిపెట్టి వెళ్లడం బా««ధగా ఉందని తెలిపారు. వైయస్‌ జగన్‌ అన్న అనుకున్న లక్ష్యం పూర్తి చేసేందుకు మేమందరం తోడుగా ఉంటామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో మేలు చేశారని, జగనన్న వస్తే మా జీవితాలు బాగుపడుతాయన్న ఆశతో ఉన్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. మా కుటుంబాలు అంతా కూడా జననేత వెంట ఉంటాయని, వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే ఉద్యోగాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
Back to Top