ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట విషాదం

తిరుప‌తి) వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్క‌ర్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకొంది. ఆయ‌న తాత  చెవిరెడ్డి మునిరెడ్డి  మృతి చెందారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మునిరెడ్డి మ‌ర‌ణం గ్రామంలో విషాదం రేపుతోంది. చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిని చాలా మంది ప‌రామ‌ర్శించారు. పార్టీ త‌ర‌పు నుంచి  పార్టీ ప్రధాన కార్య‌ద‌ర్శి విజయ్‌సాయి రెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోజా తదితరులు తుమ్మగుంట గ్రామానికి చేరుకుని నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Back to Top