గ్రేటర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి చేరిక

హైదరాబాద్:

గ్రేటర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఖురేషీ, మహిళా నాయకురాలు కోమలిరెడ్డి తమ అనుచరులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నారాయణగూడలోని వైఎంసీఏ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పార్టీ సీఈసీ సభ్యుడు రెహమాన్, ఖైరతాబాద్ నియోజకవర్గం నేత విజయారెడ్డి పారటీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై వ్యంగ్యోక్తులతో రెహమాన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర చేస్తుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు వస్తున్నా నీకోసమంటూ జగన్‌ను కలిసేందుకు చంచల్‌గూడ జైలు వద్ద బారులు తీరారన్నారు. పండిత్ నెహ్రూనగర్ సంయుక్త బస్తీల చైర్మన్ సయ్యద్ వాహెద్‌తో పాటు ఆయన అనుచరులు 1500 మంది పార్టీలో చేరారు. స్థానిక పార్కు ఆవరణలో ఏర్పాటైన కార్యక్రమంలో పార్టీ నేతలు రెహమాన్, సేవాదళం రాష్ట్ర కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, కూకట్‌పల్లి నియోజకవర్గం నాయకులు వడ్డెపల్లి నర్సింగరావు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష ఆధ్వర్యంలో కళాబృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Back to Top