గ్రామాల్లో మహిళా పోలీసుల నియామకం: షర్మిల

ఉప్పలచర్ల (ఖమ్మంజిల్లా), 9 మే 2013: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి‌ గ్రామంలో మహిళా పోలీసులను నియమిస్తామని పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. అక్రమ మద్యం, బెల్టుషాపులను తొలగిస్తామని చెప్పారు. ప్రజా కంటకంగా మారిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, దానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా, అష్ట కష్టాల్లో ఉన్న ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చేందుకు మరో ప్రజాప్రస్థానం పేరిట శ్రీమతి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల ఖమ్మం జిల్లా ఉప్పలచర్లలో గురువారంనాడు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మాట్లాడుతూ... రైతుల వెన్నంటి నడిచిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు ఇన్‌పుట్ సబ్సి‌డీలు ఇచ్చి ఆయన రైతులను ఆదుకున్నారని శ్రీమతి షర్మిల తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రాబందుల్లా పీక్కుతింటోందని‌ శ్రీమతి షర్మిల విమర్శించారు. పన్నుల భారం మోపి ప్రజల నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు. త్వరలోనే జగనన్న నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని శ్రీమతి షర్మిల విశ్వాసం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top