ఎమ్మెల్యే గౌత‌మ్‌రెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

నెల్లూరుః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ఆత్మ‌కూర్ నియోజ‌క‌వ‌ర్గంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మ‌ర్రిపాడు మండ‌లం నంద‌వ‌రం గ్రామంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న విద్యార్థినీల‌కు సైకిళ్లు పంపిణీ చేశారు. అదే విధంగా విద్యార్థుల‌కు దుస్తుల‌ను పంపిణీ చేశారు. అనంత‌రం జిల్లా ప‌రిష‌త్ హై స్కూల్‌లో డిజిట‌ల్ క్లాసుల‌ను ఎమ్మెల్యే గౌతంరెడ్డి ప్రారంభించారు. పెద్ద‌మాచ‌నూరు గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు అందించే మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని ఎమ్మెల్యే త‌నిఖీ చేశారు. అదే విధంగా గ్రామంలో అర్హుల‌కు ఆస‌రా పించ‌న్లు అంద‌డం లేద‌ని, ఎన్ఆర్‌జీఎస్ ద్వారా న‌గ‌దును స‌కాలంలో ఇవ్వాల‌ని అధికారుల‌తో ఫోన్‌లో మాట్లాడారు.   అనంత‌రం ఆత్మ‌కూరు మండ‌లం రావుల‌కొల్లు గ్రామంలో నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ప‌డ‌మ‌టినాయుడుప‌ల్లి గ్రామంలో నూత‌న వ‌ధూవరుల‌ను ఆశీర్వ‌దించారు. అనంత‌రం గ్రామంలో స్థానికులు ఎదుర్కొంటున్న వివిధ స‌మ‌స్య‌ల‌పై మండ‌ల స్థాయి అధికారుల‌తో చ‌ర్చించారు. స‌మ‌స్య‌లు పున‌రావృతం కాకుండా శాశ్వ‌త ప‌రిష్కారం చేయాల‌ని ఆదేశించారు.  

Back to Top