ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

కృష్ణాః
జిల్లాలోని రామన్నపేటలో బసవయ్య అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. గత మూడు
సంవత్సరాలుగా వేసిన పంటలు చేతికి రాక, అప్పుల బాధ తాళలేక బసవయ్య ఆత్మహత్య
చేసుకున్నాడని గౌతంరెడ్డి తెలిపారు. బసవయ్య మృతికి ప్రభుత్వమే బాధ్యత
వహించాలన్నారు. 

ఎన్నికల ముందు కౌలు రైతులను
అక్కున చేర్చుకుంటానని చెప్పిన చంద్రబాబు ...వారిని పట్టించుకోని కారణంగానే
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో 20
నుంచి 25 లక్షల మంది వరకు కౌలు రైతులున్నారని,  వారి ఆలన పాలన చూసే వారే
లేరన్నారు. కుటుంబం పెద్ద దిక్కు కోల్పోవడంతో అతని భార్య ముగ్గురు పిల్లల
పరిస్థితి దయనీయంగా మారిందని గౌతం రెడ్డి వాపోయారు.  అంధకారమైన
ఆకుటుంబాన్నితక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top