నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరు నామినేష‌న్‌

క‌ర్నూలు: కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌లో నామినేషన్‌ వేయనున్నారు. ఈ జిల్లాలో  జడ్పీసీటీ స్థానాలు 53, ఎంపీటీసీల సంఖ్య 815 కాగా, ఇందులో 11 మంది లేరు. దీంతో ఎంపీటీసీల సంఖ్య 804గా ఉంది. మరో వైపు వివిధ మున్సిపాలిటీల కౌన్సిలర్లలో కూడా వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే మెజార్టీ ఉంది. ఈ లెక్కన ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకు అవకాశాలు కనిపిస్తున్నాయి

Back to Top