ప్రత్యేకహోదా గళం వినిపించారని వేధింపులు

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవారిపై ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరిస్తోంది.  వైయస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించే సభలు, సమావేశాలకు సహకరిస్తున్నారంటూ సంస్థలు, వ్యక్తులపై చంద్రబాబు సర్కార్ వేధింపు చర్యలకు దిగుతోంది. ఈనెల 19న విజయనగరంలో జగన్‌ నిర్వహించిన యువభేరి సదస్సుకు ప్రజలను తరలించేందుకు బస్సులు సమకూర్చారంటూ మూడు స్కూళ్లకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. విజయనగరంలోని భాష్యం స్కూల్, శ్రీచైతన్య ఇంగ్లీషు మీడియం స్కూలు, ద సన్‌ స్కూళ్లకు జిల్లా విద్యాధికారి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

Back to Top