మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

అనంతపురం: స్టీల్‌ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీకేజీతో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని తాడిపత్రి నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్‌ చేవారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. ఈ మేరకు స్టీల్‌ ఫ్యాక్టరీ వద్ద పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల పక్షాన పోరాడుతున్న పెద్దారెడ్డితో సహాతో పలువురు నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును వైయస్‌ఆర్‌ సీపీ నేతలు తప్పుబట్టారు
Back to Top