కరువు పరిస్థితులపై చర్చించాలన్న స్పృహ లేదా?

రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో
కూరుకుపోయి ఉన్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని, పైపెచ్చు వ్యవసాయం
వృద్ధి సాధిస్తోందన్న ప్రచారం చేసుకుంటున్నారని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు
విభాగం అధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో
సాగుభూమి ఎడారిగా మారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులు
నెలకొన్నా మంత్రివర్గం సమావేశంలో చర్చించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అధికారంలోకి
వచ్చిన నాలుగేళ్ల తరువాత, ధరల స్థిరీకరణ నిధికి కేవలం 500 కోట్లు కేటాయిస్తున్నామని
ప్రకటించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యవసాయ రంగంపై ఉన్న నిర్లక్ష్య వైఖరికి
నిదర్శనమన్నారు.

Back to Top