ఆరోగ్యశ్రీపై ప్రభుత్వ కుట్ర

విజయవాడ:  పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించడం కోసం దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తివేసేందుకు ఏపీ సర్కార్ కుట్రలు చేస్తోంది.  ఆరోగ్యశ్రీ పథకానికి ప్రత్యామ్నయంగా ‘హెల్త్‌ ఫర్‌ ఆల్‌’   (అందరికీ ఆరోగ్యం) పథకాన్ని తీసుకొచ్చి ఒక్కో వ్యక్తి నుంచి నెలకు రూ.100 చొప్పున వసూలు చేయాలని చూస్తోంది. హెల్త్‌ ఫర్‌ ఆల్‌ కార్డులు ఇచ్చి... ఆరోగ్యశ్రీ కార్డులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పేదల నుంచి ప్రీమియం వసూలు చేసి...దాంతో తిరిగి వారికే వైద్యం అందించనుంది. రెండున్నరేళ్లుగా ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేసిన సర్కార్ పేదలకు మహానేత ప్రసాదించిన వైద్యాన్ని అందని ద్రాక్షగా మిగిల్చింది. ఇప్పుడు అసలుకే పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేయాలని చూస్తోంది.

Back to Top