అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు కృతజ్ఞతలు

హైదరాబాద్ః వరంగల్ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు వైఎస్సార్సీపీ  అధ్యక్షుడు వైఎస్ జగన్ , ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నల్లా సుర్యప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. తనను లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ప్రచార అస్త్రాలుగా ప్రజల్లోకి వెళతామని సూర్యప్రకాశ్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పొంగులేటి నల్లాసూర్యప్రకాశ్ కు బీం ఫాం అందజేశారు.  

కేసీఆర్ ప్రభుత్వం ప్రజల  విశ్వాసం కోల్పోయిందని సూర్యప్రకాశ్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ఆతర్వాత వచ్చిన ప్రభుత్వాలు తుంగలో తొక్కాయని సుర్యప్రకాశ్ మండిపడ్డారు. రైతులు పిట్టల్ల రాలుతున్నా టీఆర్ ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. 

Back to Top