వైయస్‌ జగన్‌ స్పీచ్‌కు ప్రభుత్వం నివ్వెరపోయింది

వెలగపూడి: ప్రభుత్వ అవినీతి పాలన నిజ స్వరూపాన్ని, వైఫల్యాలను అంకెలతో సహా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చెప్పడంతో చంద్రబాబు సహా టీడీపీ సభ్యులంతా నివ్వెరపోయారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. సభలో వైయస్‌ జగన్‌ స్పీచ్‌ అద్బుతంగా ఉందని కొనియాడారు. ప్రతిపక్ష నేతగా అత్యంత నిర్మాణాత్మకంగా మాట్లాడారన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా పచ్చి అబద్దాలతో, ప్రచార ఆర్భాటాలతో చంద్రబాబు నెట్టుకొస్తున్నారని, వాస్తవానికి రాష్ట్ర ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు. రాష్ట్రంలో దుర్భరమైన పరిస్థితులు ఏర్పడితే.. ప్రభుత్వం అత్యంత ప్రగతి సాధించిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. లక్షలాది మంది కూలీలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తుంటే, వందల సంఖ్యల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం జీడీపీ రేట్‌ వృద్ధి చెందిందని, రైతులకు మేలు చేశామని గొప్పలు చెప్పుకోవడం ఏంటని వైయస్‌ జగన్‌ ఎండగట్టారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పరిపాలన కొనసాగించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు.

Back to Top