చెరకు పంటకు మద్దతు ధర ఇవ్వండి

హైదరాబాద్, 22 జూన్‌ 2013:

చెరకు ‌పంటకు మద్దతు ధర ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేసింది. క్వింటా‌ల్ చెరకుకు 2,500 రూపాయలు మద్దతు ధరగా ఇవ్వాలని ఆ పార్టీ కోరింది. సహకార రంగ చక్కెర పరిశ్రమలలో క్రషింగ్ జరిగి మూడు నెలలు గడుస్తున్నా రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవడం ఏమిటని పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. కిరణ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నదాతలకు అనుకూల ప్రభుత్వం ఎంతమాత్రమూ కాదని, రాక్షస ప్రభుత్వం అని దుయ్యబట్టింది. రైతులు, కార్మికులకు న్యాయంగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమా‌ర్ రెడ్డి‌ శనివారంనాడు హైదరాబాద్‌లో హెచ్చరించారు.

Back to Top