'గవర్నర్ ప్రసంగంలో అంతా అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు'

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ప్రసంగం అంతా అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలతో నిండి ఉందని శాసనసభా ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనంతరం వైఎస్ జగన్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు.

రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నది అర్థసత్యమో లేక అబద్దమో చెప్పాలన్నారు. రాజధాని భూముల్లో 3 నుంచి 4  పంటలు పండుతున్నాయన్నారు. రాజధాని ప్రాంతంలోని పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదవుతున్నారని చెప్పారు. మంత్రి నారాయణ తన కాలేజీల్లో  ఫీజులు కట్టడం ఒకరోజు ఆలస్యమైతే  పిల్లల తల్లిదండ్రులకు పాతికసార్లు ఫోన్ చేసి అడుగుతున్నారని వెల్లడించారు. అధర్మం ఎప్పుడూ ఓడిపోతుందన్నారు. మానవత్వంతో తమ పార్టీ రాజధాని రైతులకు అండగా నిలిచిందని స్పష్టం చేశారు.
Back to Top