ప్రభుత్వ నిర్ణయం సరికాదు

ఉప్పలగుప్తం: పంటల బీమా, పెట్టుబడి రాయితీలను కలిపి ఒక్కటిగా ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉప్పలగుప్తంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. 2016 ఖరీఫ్‌ సీజన్‌ పెట్టుబడి రాయితీ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపేందుకు బీమాతో కలిపి రాయితీ ఇవ్వడం వల్ల కోట్ల రూపాయల మిగులు వస్తుందని భావిస్తుండటం దారుణ నిర్ణయమన్నారు. రైతు సంక్షేమం అంటూనే హక్కులు హరిస్తున్న ప్రభుత్వానికి రైతులు తగిన గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే ఇచ్చే రాయితీ రైతు పెట్టుబడికేనని మాట్లాడ‌డం సిగ్గుచేట‌న్నారు. రైతుకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే పార్టీ రైతు విభాగం తరపున ఆందోళన చేపడతామన్నారు.  స‌మావేశంలో మండల రైతు విభాగం అధ్యక్షుడు చిక్కం బాల సుబ్రమ‌ణ్యం త‌దిత‌రులు ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top