ఎస్సీ,ఎస్టీలపై ప్రభుత్వం కక్షసాధిస్తోంది

  • ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయంపై వాకౌట్‌ చేశాం
  • ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
ఏపీ అసెంబ్లీః రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీ నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులందరం వాకౌట్‌ చేశామని ఎమ్మెల్యే  కొరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు.  ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో గాలేరు–నగరి ప్రాజెక్టుపై ప్రశ్నించాం. ఈ ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు పూర్తి చేశారు. గడిచిన మూడేళ్లలో మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న చందంగా గాలేరు–నగరి ప్రాజెక్టు పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతున్నా..అవకాశం ఇవ్వకుండా బుల్‌డోజ్‌ చేస్తున్నారు.  అలాగే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అన్న దానిపై సప్లిమెంటరీ అడిగితే వాళ్ల వద్ద సమాధానం లేక పక్కనపెట్టారు. కేవలం 8 లక్షల కుటుంబాలకు మాత్రమే 50 యూనిట్ల పథకం అంటున్నారు. దాదాపు 15 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఈ పథకం కిందకు వస్తాయి. రూ.125కి మీటర్‌ ఇస్తూ..అక్కడ లైట్‌ లేకుండానే వేలకు వేలు బిల్లులు వేస్తున్నారు. ఒక లైట్‌కు అన్ని వేల బిల్లు వస్తుందా? వీటికి సమాధానం చెప్పడం లేదు. నెలకు 50 యూనిట్ల చొప్పున సంవత్సరానికి 600 యూనిట్లు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాలపై సభ నుంచి వాకౌట్‌ చేశాం. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలి.

ఓట్లు వేయలేదని ఎస్సీ, ఎస్టీలపై కక్షసాధింపు చర్యలు
ఎమ్మెల్యే నారాయణస్వామి
టీడీపీకి ఓట్లు వేయలేదని ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు.  నిజంగా ఇది చాలా ప్రవిత్రమైన అసెంబ్లీ హాల్‌ అని, నిజం చెబితేనే దినికి పవిత్రత అని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పైనా, 50 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పైనా మంత్రులు దారుణంగా అబద్ధాలు చెబుతున్నారు. అందరికి కరెంటు కనెక్షన్లు ఇస్తున్నామని చెబుతున్నారు. మంత్రులు అన్యాయంగా మాట్లాడుతున్నారు. నా నియోజకవర్గమైన జీడీ నెల్లూరులోని ఎదురుకుప్పం మం డలంలో ఓ పంచాయతీలో మూడేళ్ల క్రితం ఇల్లు కడితే ఇంతవరకు కనెక్షన్‌ ఇవ్వలేదు. ఎంఆర్‌వో, ఎంపీడీవోలకు ఫిర్యాదు చేసినా ఇవ్వడం లేదు. కారణం ఎస్సీ, ఎస్టీలు ఓట్లు వేయలేదని కక్షగట్టి కరెంటు ఇవ్వడం లేదు. ఎక్కడ చూసినా ఎస్సీ కాలనీల్లో దాడులు చేసి తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎల్‌ఈడీ బల్బులు పెట్టుకోలేదని దారుణంగా వ్యవహరిస్తున్నారు. మాకు ఓటు వేయలేదని మీకు ఇల్లు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టించారో సమాధానం చెప్పాలి. బుద్ధుడి 125 అడుగుల ఎత్తు విగ్రహం ఏర్పాటు చేస్తామంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుల,మతాలకు అతీతంగా అభివృద్ధి చేశారు. అందుకే ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అన్ని వర్గాలు ఆదరిస్తున్నారు. మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. తెలంగాణలో కూడా ఇలాగే కొనుగోలు చేస్తూ చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు ఇకనైనా శత్రుత్వం వీడి అందరికి మేలు చేయండని విజ్ఞప్తి చేస్తున్నాను.

విద్యుత్‌ చార్జీలపై బాబువన్నీ అవాస్తవాలు
ఎమ్మెల్యే వై. ఐజయ్య
వెలగపూడి: ఎస్సీలకు విద్యుత్‌ ఛార్జీలపై చంద్రబాబు ప్రభుత్వం చట్ట సభలో పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నందికోట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. 50 యూనిట్ల వరకు ప్రతీ కుటుంబానికి రాయితీ ఇస్తున్నామని చెబుతూ 51 యూనిట్లు దాటితో జీరో నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం  ఒక్క ఫ్యాన్, ఒక బల్బు ఉంటే 50 యూనిట్లు దాటిపోతుందని, దళితులపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే దాన్ని రూ. 200 యూనిట్ల పరిమితికి పెంచాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీల కుటుంబాల విద్యుత్‌ చార్జీలకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ నుంచి వాకౌట్‌ కూడా చేయడం జరిగిందని గుర్తు చేశారు. 

తాజా వీడియోలు

Back to Top