వైయస్ జగన్ చెబితేనే ప్రజా సమస్యలపై ఆలోచన.. ఎమ్మెల్యే బుగ్గన

హైదరాబాద్) ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ చెబితేనే ప్రజా
సమస్యల మీద ప్రభుత్వం హడావుడి చేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని వైయస్సార్సీపీ కేంద్ర
కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఎత్తిపోతల పథకాలు
కట్టుకొంటుంటే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని నిలదీశారు. దీని మీద వైయస్
జగన్ దీక్ష చేస్తానని ప్రకటించాకనే చంద్రబాబు ప్రభుత్వం మెలకువ వచ్చినట్లు
నటిస్తోందని అన్నారు. ఈ పథకాలు పూర్తయితే దిగువన ఉన్న రాయలసీమ, దక్షిణ కోస్తా
జిల్లాలు ఎండిపోతాయని ఆయన నిలదీశారు. సాగునీటి పథకాల గురించి పట్టించుకోవటం లేదని
ఆయన విమర్శించారు.

To read this article in English:  http://bit.ly/1OneWiG 


 

Back to Top