' స్వైన్ ఫ్లూపై సర్కారుకు చీమకుటినట్టైనా లేదు'

గుంటూరు:  ఒకపక్క స్వైన్‌ఫ్లూ వైరస్‌తో ప్రజలు బెంబేలెత్తుతుంటే ఈ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లయినా లేదని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కతెత్ర హెనిక్రిస్టినా విమర్శించారు.   ఫిరంగిపురం వచ్చిన ఆమె విలేకరులతో  మాట్లాడుతూ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూతో ఒక పక్కన చిన్నారుల నుంచి వృద్ధుల వరకు తీవ్ర ఆందోళన చెందుతుంటే ఇంతవరకు వైద్య శాఖని అప్రమత్తం చేయని ఈ ప్రభుత్వం పనితీరుని చూస్తుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజలు అనుమానించాల్సిన పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు  జిల్లాలోని  పలు ప్రాంతాలలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నా ఇంతవరకు ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించకపోవడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వ తీరుచూస్తుంటే ప్రజల యోగక్షేమాల కంటే ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు వారి వ్యాపారాలు, సొంత పనులకే సమయం సరిపోవడం లేదనే విమర్శలు వస్తున్నా పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. మండల స్థాయిలో పనిచేయాల్సిన సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా అంతా రాజధాని జపం చేస్తున్నారన్నారు.
Back to Top