రైతులను ప్ర‌భుత్వం తక్షణమే ఆదుకోవాలి

భాకరాపేట : ప‌ంట న‌ష్ట‌పోయిన రైతుల‌ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చిన్నగొట్టిగల్లు మండల వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షుడు మహేంద్రరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం చిన్నగొట్టిగల్లులో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో వేరుశనగ పంట నష్ట పోయిన రైతులకు ఇన్‌పుట్‌సబ్సీడీ ఇప్పించాలన్నారు. అలాగే మ‌ద్ద‌తు ధ‌ర లేక తీవ్రంగా నష్టపోతున్నరైతులను ఉద్యానవన శాఖ ద్వారా ఆదుకోవాలని కోరారు. తెలంగాణా ప్రభుత్వం మాదిరిగా ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలన్నారు. రైతులకు రుణ‌మాఫీ నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ పాల‌న‌లో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్నిపూర్తిగా గాలికి వదిలేసింద‌ని దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ నాయకులు జయపాల్‌రెడ్డి, మల్లిఖార్జునరెడ్డి, రెడ్డిసుబ్రమణ్యం, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Back to Top