ప్రచార ఆర్భాటాలు మాని ప్రజాశ్రేయస్సుకోసం పాటుపడాలి

వైయస్సార్ జిల్లాః  చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా పేదప్రజలకు, రైతులకు చేసింది శూన్యమని వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామనాధుల భాస్కర్‌ అన్నారు. రాజుపాళెంలో ఆయన  విలేకరులతో మాట్లాడుతూ మెన్న దీక్ష, నిన్న ఏరువాక, నేడు రుణమాఫీ పత్రాల పంపిణీ, రేపు పొలంబాట ఇలా ప్రచార ఆర్భాటాలకు పెట్టే ఖర్చు ఒక్కసారిగా రైతుల రుణాలు మాఫీ చేసింటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటంలో ఉన్నంత శ్రద్ద రాష్ట్ర అభివృద్ధిపై లేదని మండిపడ్డారు. చంద్రబాబు రైతులపై కపట ప్రేమను కురిపిస్తున్నాడని విమర్శించారు.  మెదటి, రెండవ విడతల్లో ఎంతమంది రైతులకు మాఫీ అయ్యింది, మాఫీ కాని రైతులు ఎంతమంది అన్న సమాచారం వ్యవసాయాధికారుల వద్ద లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజాధనాన్ని వృధా చేయకుండా ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగించాలని సూచించారు. 


Back to Top