బాబు పాల‌న ఎల్ల‌కాలం సాగ‌దు

 • రెండేళ్ల‌లో ఖ‌చ్చితంగా ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం వ‌స్తుంది

 • ప‌ట్టిసీమ‌కు ఇచ్చిన ప్యాకేజీ పోల‌వ‌రం బాధితుల‌కు సైతం ఇవ్వాలి

 • వేలేరు బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 
 • వేలేరు: చ‌ంద్ర‌బాబు అవినీతి, అక్ర‌మాల పాల‌న ఎల్ల‌కాలం ఉండ‌ద‌ని, రెండేళ్ల‌లో ఖ‌చ్చితంగా ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని
  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి
  అన్నారు. బుధ‌వారం ఆయ‌న పశ్చిమగోదావరి జిల్లా ఏజన్సీ ప్రాంతమైన  వేలేరు లో ప్ర‌సంగించారు. ప‌ట్టిసీమకు పోల‌వ‌రానికి
  ఎక్కువ దూరం లేద‌ని,
  ప‌ట్టిసీమ‌లో ఒక
  ప్యాకేజీ ఇస్తూ, ఇక్క‌డ మ‌రో ర‌కంగా ప్యాకేజీ కేటాయించ‌డం సిగ్గు చేట‌న్నారు.  వైయస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

   

  *
  ప‌ట్టిసీమ రైతుల‌కు
  రూ. 20 ల‌క్ష‌ల ప్యాకేజీ ఇస్తున్నారు... మ‌రి పోల‌వ‌రం
  నిర్వాసితుల‌కు ఎందుకు ఆ ప్యాకేజీని అమ‌లు చేయ‌రు

  *
  రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా
  ఇది మీకు ధ‌ర్మమేనా చంద్ర‌బాబు

  *
  పోల‌వరం కోసం
  ముందుగా భూముల‌ను త్యాగం చేసిన వారికి రూ. 1 ల‌క్ష 15వేలు ఏ విధంగా స‌రిపోతాయి... ఎలా బ్ర‌తుకుతారు

  *
  ఎక‌రా భూమి కొనాలంటే
  రూ. 10 నుంచి 15 ల‌క్ష‌లు కావాలి

  *
  ల‌క్ష 15 వేలతో భూ నిర్వాసితులు ఎలా బ్ర‌తుకుతారు

  *
  ఇప్ప‌టికైనా
  చంద్ర‌బాబు మేల్కొని రూ. 5ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

  *
  చంద్ర‌బాబు
  అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు పూర్త‌వుతున్నప్పటికీ ఇప్ప‌టికి విలీన మండ‌లాల‌కు
  స్థానిక‌త లేదు

  *
  విలీన మండ‌లాల
  ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌డం లేదు

  *
  చంద్ర‌బాబు
  సిగ్గుతో త‌ల‌దించుకోవాలి

  *
  స్థానిక‌త స‌మ‌స్య‌ను
  ప‌రిష్కారించ‌క‌పోవ‌డం వ‌ల్ల విద్యార్థులు ఎక్క‌డ ప‌రీక్ష‌లు రాయాలో అర్థం కావ‌డం
  లేదు

  *
  తెలంగాణ వారు
  ఆంధ్ర‌లో అని,...
  ఆంధ్ర‌లో రాస్తే
  మీ స్థానిక‌త ఇంకా ధృవీక‌ర‌ణ కాలేదంటు విద్యార్థుల భ‌విష్య‌త్తుతో ఆడుకుంటున్నారు

  *
  రెండేళ్లుగా
  ఇలాంటి పాల‌న చేస్తునందుకు ముఖ్య‌మంత్రి సిగ్గుతో త‌ల‌దించుకోవాలి

  *
  బాబు ప‌రిపాల‌న
  ఎల్ల‌కాలం సాగ‌దు

  *
  బాబు మంచి చేసినా
  చేయ‌క‌పోయినా ఖ‌చ్చితంగా రెండేళ్ల‌లో ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం వ‌స్తుంది

  *
  ప‌ట్టిసీమ‌కు
  అందించే అదే రూ. 20 ల‌క్ష‌ల ప్యాకేజీ మ‌నంద‌రికి వ‌చ్చేలా
  చేస్తా

  *
  చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త
  స్వార్థం వ‌ల్లే ప్ర‌జ‌ల‌కు ఇన్ని క‌ష్టాలు .

   

  అని
  ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రజలకు విడమరిచి చెప్పారు. వైయస్ జగన్ ఆత్మీయ
  ప్రసంగానికి ఏజన్సీ వాసులు హర్షం తెలిపారు.

   

Back to Top