ప్రతిపక్ష నేత ప్రసంగానికి మంత్రుల అడ్డంకులు

అసెంబ్లీః ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పై అధికార టీడీపీ సభ్యులు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో వైఎస్ జగన్ రెడ్డి మాట్లాడుతుండగా పదేపదే అడ్డు తగిలారు. ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగారు.

వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా గందరగోళం సృష్టించారు. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ తో అబద్దాలు చెప్పించారని వైఎస్ జగన్ ప్రభుత్వంపై  ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ నేతల భూదందా గురించి వైఎస్ జగన్ ప్రస్తావించినప్పుడు టీడీపీ సభ్యులు సభలో ఒక్కసారిగా గందరగోళం సృష్టించారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఎదురుదాడికి దిగారు.

వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని పూర్తిచేయకుముందే మంత్రులు మధ్యమధ్యలో జోక్యం చేసుకుని అంతరాయం కలిగించారు. మొదట పల్లె రఘునాథ్ రెడ్డి, తర్వాత అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావులు ముందస్తు స్క్రిప్ట్ ప్రకారం చర్చను పక్కదారిపట్టించేందుకు ఎదురుదాడికి దిగారు. సంయమనం వ్యవహరిస్తూ  వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను సభా వేదికగా ఎండగట్టారు. 

Back to Top