రాజకీయ నిరుద్యోగుల కోసమే...!

పంటలు కొనే నాథుడే కరువయ్యాడు..!
వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితి..!

అవసరం
లేని ఆర్భాటాలకు చంద్రబాబు వందలాది కోట్లు దుబారా చేస్తూ, రైతులు
పండించిన పంటలకు మాత్రం నిధులు వెచ్చించడడం లేదని వైఎస్సార్సీపీ శాసనసభా
ఉపపక్ష నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. రైతుల పంటలు చేతికొచ్చినా,
ధాన్యాన్ని సేకరించేందుకు  కావల్సిన కొనుగోలు కేంద్రాన్ని ఎక్కడా ఏర్పాటు
చేయలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రకటనలకే  పరిమితమయ్యిందని నెహ్రూ
ఎద్దేవా చేశారు. రూ. 800లకే  బస్తా ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితిలో
రైతాంగం ఉందని..టీడీపీ ప్రభుత్వం వల్లే ఈదుస్థితి వచ్చిందని ఫైరయ్యారు.

నిధులేమయ్యాయి..!
రాష్ట్ర
బడ్జెట్ లో ధరల స్థిరీకరణ నిధికి ప్రభుత్వం కేటాయించిన రూ.3 వేల కోట్లు
ఏమయ్యాయని  నెహ్రూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల పంటలకు నిధులు
వెచ్చించాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యం అమ్ముకున్న 15 రోజులకు రైతుల
అకౌంట్లోకి డబ్బులు చేరడం సరికాదన్నారు. కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం
గింజకు 24 గంటల్లో డబ్బులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో
ఉన్నప్పుడు రైతులకు అదనంగా రూ. 300 బోనస్ ఇవ్వాలని ప్రకటించిన
చంద్రబాబు...ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎదుటివారిమీద
బురదజల్లడం తప్పించి, ఆయన అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని
దుయ్యబట్టారు.  

రాజకీయ నిరుద్యోగుల కోసమేనా..!
రాష్ట్రంలో
రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితులు కల్పించాడని నెహ్రూ
చంద్రబాబుపై మండిపడ్డారు. పంటలకు సెక్యూరిటీ లేదని, కొనే నాథుడే కరువయ్యి
గిట్టుబాటు లభించని పరిస్థితులున్నాయని నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్కెట్ యార్డ్ లు రాజకీయ నిరుద్యోగులకు పదవులివ్వడానికే తప్ప, రైతులకు
గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏమాత్రం ఉపయోగపడడం లేదన్నారు.  వెంటనే ధాన్యం
సేకరణకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో పాటు రైతులకు  గిట్టుబాటు ధర
కల్పించాలన్నారు. 
Back to Top