పేదల సొమ్ముల్ని కొల్లగొడుతున్న ప్రభుత్వం

() నిరుపేదల సొమ్ములపై ప్రభుత్వం
కన్ను

() ఉపాధి హామీ నిధులు పక్కదారికి
మళ్లింపు

() పట్టి సీమ కోసం పోలవరం తాకట్టు

హైదరాబాద్) నిరుపేదల సొమ్ముల్ని
పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరోసారి బట్టబయలు
చేశారు. ఈ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు
శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలోఈ అంశం మీద
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడారు.

పేదల సొమ్ముల్ని మళ్లిస్తారా..!

       ఒక
వైపు నిధులు దారి మళ్లటం లేదని చెబుతూనే, మరో వైపు మంత్రిత్వ శాఖ ఇచ్చిన లేఖలో
నిధుల్ని దారి మళ్లిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఎస్సీ
సబ్ ప్లాన్ నిధుల్ని ఏ రకంగా దారి మళ్లిస్తున్నదీ సోమవారం నాటి సభలో స్పష్టంగా
వివరించానని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆధారాలతో సహా బయట పెట్టినా కానీ, ఏ మాత్రం
చలనం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి
కేటాయించిన నిధుల్ని దారి మళ్లించి సిమెంట్ రోడ్లు వేయటానికి వెచ్చించటాన్ని వైఎస్
జగన్ తప్పు పట్టారు. ఉపాధి                హామీ
పథకం నిధులు అంటే నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన వని అటువంటి నిధుల్ని
సిమెంట్ రోడ్లకు మళ్లించటం ఎంత వరకు సబబని ఆయన నిలదీశారు. సిమెంట్ రోడ్లను తాము
వ్యతిరేకించటం లేదని, కానీ వీటికోసం వేరే నిధులు వాడుకొంటే సబబుగా ఉండేదని
పేర్కొన్నారు.

చేనేత కార్మికుల్ని ఆదుకోరా..!

                వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద రంగం చేనేత
కార్మిక రంగమే అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. కానీ, వారి పరిస్థితి ప్రభుత్వ
నిర్లక్ష్యం కారణంగా దయనీయంగా మారిందని చెప్పారు.రూ.110 కోట్లు చేనేత కార్మికులకు రుణమాఫీ
చేశామంటున్నారని కానీ ఎక్కడా మాఫీ కాలేదని అన్నారు. ధర్మవరంలో 12మంది కార్మికులు చనిపోతే
వాళ్లింటికి వెళ్లి బాధలు విన్నామని చెప్పారు. చేనేత కార్మికులంతా
విలవిల్లాడుతుంటే, 22 వేలమందికి మాత్రమే రుణమాఫీ చేశాం, అంతటితో అయిపోయిందంటే ఎలా అని
ప్రశ్నించారు.  

పోలవరం విషయంపై బాబు ప్రభుత్వం
దొంగాట                                                                                                                            

పోలవరం ప్రాజెక్టు విషయంలో
చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. నీటి స్టోరేజీ సౌకర్యం లేని పట్టి సీమ
పథ కం కోం పోలవరం ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేశారని పేర్కొన్నారు.'1650 టీఎంసీల
నీళ్లు సముద్రం పాలయ్యాయని ఓవైపు చెబుతారు. 8 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లామని
మరోవైపు చెబుతారు. వరద నీళ్ల స్టోరేజి కోసమే పోలవరం కడుతున్నారు. అందుకే దాన్ని
పోలవరం అంటారు. ఆ నీళ్లు నిల్వ చేసుకుంటే, తర్వాత నీళ్లు డైవర్ట్ చేయగలిగితే
కృష్ణాకైనా, శ్రీశైలానికైనా
ఇవ్వచ్చు. కానీ మీ పట్టిసీమలో స్టోరేజి అనేది లేదు. అదే మీరు చేస్తున్న అన్యాయం.
పట్టిసీమ కోసం పోలవరం ప్రాజెక్టును కాంప్రమైజ్ చేస్తారు. చివరకు తెలంగాణ
ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు' అని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని
ఎండగట్టారు. సామాన్యుల అవసరాలకు సంబంధించిన అంశాలపై
ప్రభుత్వం ఆడుతున్న దొంగాటకు నిరసనగా వాకౌట్ చేస్తున్న ట్లు ప్రతిపక్ష నేత వైఎస్
జగన్ ప్రకటించారు. ఆయన నాయకత్వంలో వైఎస్సార్సీపీ సభ్యులంతా బయటకు వచ్చేశారు.

 

Back to Top