చేతులు దులుపుకొన్న స‌ర్కారు

హైద‌రాబాద్ ) ఉద్యోగాల భర్తీ మీద ప్ర‌భుత్వం చేతులు దులుపుకొంది. రాష్ట్రంలో ఒక ల‌క్ష 45 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని స్ప‌ష్టం గా లెక్క తేలింది. విభ‌జ‌న స‌మ‌యానికి ఉన్న ఉద్యోగాల‌కు తోడు, ప‌దవీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెరిగిన ఉద్యోగుల రిటైర్మంట్ తో ఏర్ప‌డిన ఖాళీలు క‌లుపుకొంటే ఈ లెక్క తేలింది. అయినా స‌రే ప్ర‌భుత్వం మాత్రం దొంగ లెక్క‌లు చెబుతూనే ఉంది. తాజాగా మంగ‌ళ‌వారం నాడు ఆర్థిక మంత్రి కార్యాల‌యం నుంచి ఒక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఒక ల‌క్ష 45 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయ‌న్న వాద‌న  స‌రి కాద‌ని, 77వేల ఉద్యోగాలు మాత్ర‌మే ఖాళీ ఉన్నాయని, వీటిలో 20 వేల ఉద్యోగాల్ని ద‌శ‌ల వారీగా భర్తీ చేస్తామ‌ని ఈ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించారు. దీన్ని బ‌ట్టి చూస్తే నిరుద్యోగుల‌కు చంద్రబాబు స‌ర్కారు కుచ్చు టోపీ పెడుతోంద‌ని అర్థం అవుతోంది. 

తాజా ఫోటోలు

Back to Top